బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల్లో కనిపించిన వేరియంట్ల కంటే భారత్ వేరియంట్ మరింత వేగంగా విస్తరిస్తుండటంతో ప్రమాదకరమైన వేరియంట్ల జాబితాలో భారత్ వేరియంట్‌ను చేర్చారు.
ఈ స్ట్రెయిన్ వ్యాప్తి సాధారణ కరోనా వైరస్‌తో పోలిస్తే తీవ్రంగా ఉందని, చాలా దేశాల్లో ఈ రకం వల్ల కేసులు వేగంగా పెరిగాయని, అందుకే దీన్ని ఆందోళనకర జాబితాలో చేర్చినట్లు డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. ఈ స్ట్రెయిన్ మూలంగానే భారత్‌లోనూ కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు పేర్కొంది.