బి.1.617 జంట ఉత్పరివర్తనాల వైరస్ రకం. తొలిసారిగా ఇది భారత్‌లో బయటపడగా.. యూకే, సింగపూర్ సహా పలు దేశాల్లో ఈ రకాన్ని గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌వో తన వీక్లీ అప్‌డేట్‌లో తెలిపింది. అయితే ప్రస్తుతానికి ఇది ప్రాణాంతకం అని ప్రటించలేమని పేర్కొంది.
అంతేగాక, ఈ రకం వైరస్‌పై భారత్‌లో అందుబాటులో ఉన్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు మెరుగ్గా పనిచేస్తున్నాయని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ తెలిపింది.