భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా మహమ్మారిపై పోరాటానికి తన వంతు విరాళం ప్రకటించాడు. దేశంలోని ప్రముఖులు సామాజిక బాధ్యతతో స్పందిస్తూ భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి సహాయనిధికి రూ.25లక్షలు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు.
ఇదిలా ఉంటే కరోనా మృత్యుఘోషతో ఇటలీ అట్టుడికిపోతోంది. ఇప్పటికే వేలసంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడి మృత్యు ఒడిలోకి చేరిపోతున్నారు. దీనిని అరికట్టేందుకు, ఆ మహమ్మారి బారి నుంచి తమ ప్రజలను కాపాడుకునేందుకు ఇటలీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేవీ తగిన ఫలితాలనివ్వడం లేదు.