కరోనా కోరల్లో చిక్కుకుని కాంగ్రెస్ అభ్యర్థి రెజాల్ హక్ మృతి

గురువారం, 15 ఏప్రియల్ 2021 (15:43 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కోరల్లో చిక్కుకుని పలువురు చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కరోనా బారిన పడి మరో రాజకీయనేత మరణించిన ఘటన వెలుగులోకి వచ్చింది. పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రెజాల్ హక్ కరోనా సోకి మరణించారు.
 
కాగా కరోనా నిర్ధారణ కావడంతో రెండ్రోజుల క్రితం కోల్‌కతా లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన రెజాల్ పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఇకపోతే ముర్షీదాబాద్ జిల్లాలో ఉన్న షంషేర్‌గంజ్‌లో‌ ఏడో విడతలో భాగంగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. 
 
కాగా ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రెజాల్ హక్ బరిలో ఉన్నారు. అయితే మరో పది రోజుల్లో ఎన్నికలు జరగనుండగా ఇలా ఈయన హఠాత్తుగా మరణించడం విషాదకరం. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ వర్గాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు