రాహుల్ వ్యాఖ్యలతో ఎంవీఏ కూటమి ప్రమాదంలో పడింది.. సంజర్ రౌత్

శనివారం, 19 నవంబరు 2022 (09:41 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ  చేసిన వ్యాఖ్యలతో మహారాష్ట్రంలోని మహా వికాస్ అఘాడీ (ఎంవిఏ) సంకీర్ణ ప్రభుత్వం ప్రమాదంలో పడిందని శివసేన పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో తన పాదయాత్రను రాహుల్ గాంధీ మహారాష్ట్రలో చేస్తున్నారు. ఈ సందర్భంగా హిందూ సిద్ధాంతకర్త, స్వాతంత్ర్య సమరయోధుదు వీర సావర్కర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యను పెను దుమారాన్ని రేపాయి. బీజేపీ, శివసేనలకు ఆగ్రహం తెప్పించాయి. 
 
బ్రిటీష్ పాలకులు భయపడిన సావర్కర్ వారికి క్షమాభిక్ష రాసి పింఛను తీసుకున్నని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీతో తమ భాగస్వామ్యం ప్రమాదంలో పడిందని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. సావర్కర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలు తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. 
 
దీంతో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందించి, నష్ట నివారణ చర్యలు చేపట్టారు. సావర్కర్‌ను రాహుల్ లక్ష్యంగా చేసుకోలేదని. ఓ చారిత్రక వాస్తవాన్ని మాత్రమే ఆయన ఎత్తి చూపారని వివరణ ఇచ్చారు. అందువల్ల రాహుల్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో తమ కూటమిపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. 
 
ఇదిలావుంటే, రాహుల్ వ్యాఖ్యలు మహాత్మా గాంధీజీ మునిమనవడు తుషార్ గాంధీ మద్దతు పలికి, రాహుల్‌కు అండగా నిలించారు. సావర్కర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలు నిజమేనని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు