పాక్ క్రికెట్ ఆణిముత్యం వసీం అక్రమ్

WD PhotoWD
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఆల్‌రౌండర్‌గా వసీం అక్రంకు ఓ సముచిత స్థానం ఉంది. లెప్ట్ హ్యాండ్ ఫేస్ బౌలర్‌గా తన సత్తా నిరూపించుకున్న అక్రమ్ అటు బ్యాట్స్‌మెన్‌గానూ ఆపద సమయాల్లో జట్టును ఆదుకున్నాడు. దాదాపు 19ఏళ్లపాటు పాక్ క్రికెట్‌కు తన సేవలందించిన వసీం అక్రమ్ 2003లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

బౌలర్‌గా 916 వికెట్లు పడగొట్టిన అక్రమ్ బ్యాట్స్‌మెన్‌గానూ 6500 పై చిలుకు పరుగులు సాధించాడు. పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాధించుకున్న అక్రమ్ కెరీర్, వ్యక్తిగత విశేషాలను ఓసారి పరిశీలిస్తే... పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో గల లాహోర్ నగరంలో 1966లో అక్రమ్ జన్మించాడు.

చిన్ననాటి నుంచి క్రికెట్ అంటే మక్కువ కల్గిన అక్రమ్ న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ సందర్భంగా 1984లో తన 18వ ఏటనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించాడు. అటుపై 1985లో న్యూజిలాండ్‌తోనే జరిగిన టెస్ట్ సిరీస్ సందర్భంగా టెస్ట్ మ్యాచ్‌లలోనూ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే నాటికి 104 టెస్టులాడి 414 వికెట్లు సాధించిన అక్రమ్ 356 వన్డేలు ఆడి 502 వికెట్లు సాధించాడు.

అలాగే తాను ఆడిన టెస్ట్ మ్యాచ్‌లలో అక్రమ్ మొత్తం 2898 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలతో పాటు ఏడు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. అలాగే వన్డేల్లో 3717 పరుగులు సాధించిన అక్రమ్ ఇందులో ఆరు అర్థ సెంచరీలు నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడినంతకాలం పాక్ క్రికెట్‌లో కీలకమైన ఆటగాడిగా అక్రమ్ కొనసాగడం విశేషం.

వెబ్దునియా పై చదవండి