టీమిండియాలో నితీశ్ స్థానం పదిలం : సునీల్ గవాస్కర్

ఠాగూర్

బుధవారం, 1 జనవరి 2025 (11:11 IST)
భారత క్రికెట్ జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ఆపద్బాంధవుడులా సెంచరీ సాధించడంతో పాటు.. జట్టును ఫాలోఆన్ గండం నుంచి గట్టెంకించిన ఆంధ్రా క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై లెజెండ్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత జట్టులో నితీశ్ స్థానం పదిలమన్నారు. 
 
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో యువ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత సెంచరీ సాధించిన విషయం తెల్సిందే. నితీశ్‌కు టెస్టు కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ. మెల్‌బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్ 114 పరుగులు చేశాడు. అయితే, ఈ ఇన్నింగ్స్‌లో జట్టు గెలవలేకపోయింది.
 
కానీ, తొలి టెస్ట్ మ్యాచ్ ఆడిన నితీశ్ కుమార్‌ ఆట తీరు మాత్రం ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసింది. అందుకే క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ స్పందించారు. ప్రతి టెస్ట్ మ్యాచ్‌లో రోజురోజుకూ రాణించాడని అన్నారు. మెల్‌‌బోర్న్‌లో భారత జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో సెంచరీ సాధించి జట్టులో తన స్థానాన్ని పటిష్ఠం చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడని చెప్పారు. 
 
హార్దిక్ టెస్ట్ క్రికెట్‌కు దూరమైన నాటి నుంచి మీడియం పేస్ బౌలింగ్, బ్యాటింగ్ చేయగల ఆల్ రౌండర్ కోసం భారత్ ఎదురుచూస్తోందని అన్నారు. నితీశ్ బౌలింగ్ పురోగమిస్తుందన్నారు. కెరీర్ మొదట్లో హార్థిక్ కంటే నితీశ్ మెరుగ్గా కనిపించాడని చెప్పారు. ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో నితీశ్ ఇప్పటి వరకు 294 పరుగులు చేయడంతో పాటు మూడు వికెట్లు పడగొట్టాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు