ఆస్ట్రేలియాలో భారత దంపతుల దుర్మరణం

ఆదివారం, 22 డిశెంబరు 2019 (16:33 IST)
ఇటీవలే వివాహం చేసుకున్న భారత్‌కు చెందిన యువతీ యువకులు, ఆస్ట్రేలియాలో జరిగిన ఘోర ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై, మంటలు చెలరేగగా, ఇద్దరూ సజీవదహనమయ్యారు. 
 
వివరాల్లోకి వెళితే, కేరళలోని వెంగోల ప్రాంతంలో వలసాల తొంబర హౌజ్‌కు చెందిన రిటైర్డ్ ఎస్ఐ మాథ్యూస్ కుమారుడు అల్బిన్ మాథ్యూస్ (30)కు, కొత్తమంగళంకు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ అధికారి ఎల్డో కుమార్తె నిను సుసేన్ (28)కి ఈ సంవత్సరం అక్టోబర్ 28న వివాహం జరిగింది. 
 
ఆపై నవంబర్ 20న ఇద్దరూ ఆస్ట్రేలియాకు వెళ్లారు. నిను సుసేన్ ఆస్ట్రేలియాలోని ఓ ఆసుపత్రిలో నర్స్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలో న్యూ సౌత్ వేల్స్ ప్రాంతంలో నవ దంపతులు ఇద్దరూ కారులో వెళుతుంటే ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇద్దరి మరణ వార్తను తెలుసుకున్న రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు