'బెస్ట్ డ్రెసప్ అవార్డు' అనే క్యాప్షన్‌తో ఈ పోస్ట్ పెట్టింది ప్రస్తుతం వీటికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఈ దృశ్యాలపై నెటిజన్లు రకారకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే క్రికెట్ ఆస్ట్రేలియ కూడా దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేరు చేసింది. ' సాధారణ బ్రిస్బేన్ ప్రవర్తన #AUSvIND,' అనే క్యాప్షన్‌తో ఆ పోస్ట్ పెట్టింది.
ఈ టెస్ట్ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. ఈ నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఇండియా 1-1తో సమానంగా ఉన్నాయి. బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా,భారత్ మధ్య జరుగుతోన్న చివరి టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ వికెట్ నష్టపోకుండా 6 ఓవర్లలో 21 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి డేవిడ్ వార్నర్(20), మార్కస్ హారిస్(1) క్రీజులో ఉన్నారు