''అజర్'' సినిమాలో రవిశాస్త్రి రోల్‌పై రచ్చ.. భార్య ఉండగానే మరో మహిళతో కిస్ పెడుతూ..?!

మంగళవారం, 17 మే 2016 (10:21 IST)
భారత మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ''అజర్'' చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ ఏకంగా న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. ప్రస్తుతం టీమిండియా డైరక్టర్ రవిశాస్త్రి వంతు వచ్చింది. రవిశాస్త్రి తన భార్యను మోసం చేసినట్లు ఆ సినిమాలో చూపించారు.
 
ఇంకా రవిశాస్త్రి స్త్రీలోలుడిగా చిత్రీకరించడంపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. భార్యతో కలిసి ఓ టూర్‌కు వెళ్లిన రవి.. ఆమె హోటల్‌లో ఉండగానే మరో గదిలో ఓ మహిళను కౌగిలించుకొని ముద్దు పెడుతున్నట్టు చూపించారు. 
 
కాగా, రవి పాత్ర చిత్రణ చూసి అతని కుటుంబ సభ్యులు కూడా షాక్‌కు గురైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాలో తమ పాత్రల చిత్రీకరణపై అజారుద్ధీన్ మాజీ భార్య, నటి సంగీతా బిజిలాని అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి