కాటలున్యా జాగ్వార్- సోహల్ హాస్పిటల్‌టెట్ మధ్య జరిగిన యూరోపియన్ క్రికెట్ T10 మ్యాచ్‌లో ఈ అసాధారణమైన రికార్డ్ బ్రేక్ అయ్యింది. 22 సిక్సర్లు, 14 బౌండరీలతో 193 పరుగులతో అజేయంగా నిలిచిన హమ్జా ఇప్పుడు T10 క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించిన క్రికెటర్‌గా రికార్డ్ సాధించింది.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కాటలున్యా జాగ్వార్ 10 ఓవర్లలో మొత్తం 257/0 పరుగులు చేసింది. జాగ్వార్స్ తరఫున, హంజా కేవలం 43 బంతుల్లో 193* పరుగులు చేశాడు. అతను కాకుండా, యాసిర్ అలీ కేవలం 19 బంతుల్లో 58* పరుగులు చేశాడు.
ఈసారి బంతితో మొత్తం మూడు వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు ఫైసల్ సర్ఫరాజ్, ఫరూఖ్ సొహైల్, అమీర్ హమ్జా, ఎండి ఉమర్ వకాస్ తలో వికెట్ తీశారు.