ఓ ఇంటివాడైన జస్పీత్ బుమ్రా.. సంజనతో కలిసి ఏడడుగులు.. (video)

సోమవారం, 15 మార్చి 2021 (16:31 IST)
Bumrah
టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్పిత్ బుమ్రా ఓ ఇంటివాడయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా వివాహం సోమవారం జరిగింది. స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్ ను బుమ్రా వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని బుమ్రా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపాడు. 'మా జీవితాల్లో ఇది ఎంతో ఆనందకరమైన రోజు. మేమిద్దరం కలిసి కొత్త జర్నీని స్టార్ట్ చేస్తున్నాం' అని బుమ్రా తన ట్వీట్ లో పేర్కొన్నాడు.
 
గత కొన్ని రోజులుగా బుమ్రా, సంజన సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్ట్‌తోపాటు టీ20 సిరీస్‌కు దూరంగా ఉండాలని బుమ్రా నిర్ణయించినప్పటి నుంచీ అతని పెళ్లిపై వార్తలు వస్తున్నాయి. 
 
మొదట్లో టాలీవుడ్ నటి అనుపమ పరమేశ్వరన్‌ను అతడు పెళ్లి చేసుకోబోతున్నాడనీ వార్తలు వచ్చినా.. వీటిని ఆమె తల్లి ఖండించడంతో ఆ పుకార్లకు ఫుల్‌స్టాప్ పడింది. అయితే చివరకు వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. 
 
కాగా గోవాలో ఇద్దరి కుటుంబ సభ్యుల సమక్షంలో వీళ్ల పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి వధూవరుల సన్నిహితులు కూడా కొంతమంది హాజరయ్యారు. ఆదివారమే పెళ్లికి ముందు జరగాల్సిన వేడుకలన్నీ పూర్తయినట్లు బుమ్రా సన్నిహితులు వెల్లడించారు.

ఇక పెళ్లిలో మొబైల్ ఫోన్ల వాడకంపై కూడా ఆంక్షలు ఉన్నట్లు వాళ్లు తెలిపారు. కొవిడ్‌-19 కారణంగా కేవలంఅతంత సన్నిహితుల సమక్షంలో మాత్రమే బుమ్రా పెళ్లి జరిగింది. ఇందుకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నారు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు