స్కై స్పోర్ట్స్ ఛానల్ ఫ్రీ టు ఎయిర్.. చెప్పినట్లే చేసింది..

శనివారం, 13 జులై 2019 (15:23 IST)
ఇంగ్లండ్ ఫైనల్లోకి ప్రవేశిస్తే ఆ మ్యాచ్‌ను ఫ్రీ టు ఎయిర్‌గా ప్ర‌సారం చేస్తామ‌ని స్కై స్పోర్ట్స్ ఛాన‌ల్ సెమీస్ మ్యాచ్‌కు ముందు ప్ర‌క‌టించింది. అయితే ఇంగ్లండ్ ఫైన‌ల్లో ప్ర‌వేశించిడంతో.. ఫైన‌ల్ మ్యాచ్‌ను స్కై ఛాన‌ల్ ఫ్రీ టు ఎయిర్‌గా ప్రసారం చేయనుంది. 
 
యూకేలో 2005 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ల ప్రసార హక్కులు స్కై స్పోర్ట్స్‌ చేతిలోనే ఉన్నాయి. ప్రస్తుతం యూకేలో ప్రసార హక్కులను చానెల్‌ ఫోర్ దక్కించుకుంది. స్కై స్పోర్ట్స్‌తో వ్యవహారం కుదరకపోవడంతో ఆ సంస్థ ఒప్పందం చేసుకోలేదు. అయితే, ఇంగ్లండ్‌ ఫైనల్‌ చేరిన నేపథ్యంలో చానెల్‌ 4 దిగొచ్చింది.
 
క్రికెట్‌ పట్ల ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు ఫ్రీ టు ఎయిర్‌గా ప్ర‌సారం చేయాలని నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు