అప్పుడు కేవలం సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీలు మాత్రమే నిర్వహించింది. ఈ ఏడాది అలా కాకుండా అన్ని టోర్నీలను మునుపటిలా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ 2021-22 సీజన్ సెప్టెంబర్ 21 నుంచి సీనియర్ మహిళల వన్డే లీగ్‌తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 27 నుంచి సీనియర్ మహిళల వన్డే ఛాలెంజర్ ట్రోఫీ ఉంటుంది.
ఈ క్రమంలోనే అక్టోబర్ 20 నుంచి నవంబర్ 12 వరకు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ, నవంబర్ 16 నుంచి 2022 ఫిబ్రవరి 19 వరకు రంజీ ట్రోఫీలు జరగనున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 26 వరకు విజయ్ హజారే ట్రోఫీ నిర్వహించనున్నారు.