రావల్పిండి క్రికెట్ స్టేడియంలో గురువారం జరగాల్సిన పెషావర్ జల్మి, కరాచీ కింగ్స్ మధ్య జరగాల్సిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) మ్యాచ్ రద్దు అయ్యింది. రావల్పిండితో సహా పాకిస్తాన్‌లోని అనేక ప్రదేశాలలో భారత సాయుధ దళాలు ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్న తర్వాత ఈ మ్యాచ్‌లను రద్దు చేశారు. పీఎస్ఎల్ మిగిలిన అన్ని మ్యాచ్‌లను విదేశాలకు - దోహా లేదా దుబాయ్‌కి మార్చాలని పీసీబీ అధికారులు సూచించారు.