గంగూలీ ఆరోగ్యంగా ఉన్నారు.. బైపాస్ సర్జరీ అవసరం లేదు..

సోమవారం, 4 జనవరి 2021 (11:46 IST)
గుండెనొప్పి కారణంగా యాంజియోప్లాస్టి చేయించుకున్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. గంగూలీ గుండె పనితీరును తెలుసుకునేందుకు ఆయనకు ఇవాళ ఈకో కార్డియోగ్రఫీ నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. గంగూలీ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
 
దాదాకు తదుపరి చికిత్స అంశంపై తొమ్మిది మంది మెడికల్ బోర్డు సభ్యులు.. ఉదయం 11:30 గంటలకు సమావేశమై చర్చించనున్నారు. ఈ సమావేశానికి గంగూలీ కుటుంబ సభ్యులు కూడా హాజరు కానున్నారు. శనివారం స్వల్ప గుండెపోటు రావడంతో గంగూలీ దవాఖానలో చేరారు. దాదా గుండె రక్తనాళాలు మూడు చోట్ల మూసుకుపోవడంతో స్టెంట్‌‌ను పంపి వైద్యులు క్లియర్‌ చేశారు.
 
ఇంకా దాదా ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. ఆయన గంగూలీ ఆరోగ్యంగా ఉన్నారని.. ఆయనకు బైపాస్ సర్జరీ అవసరం లేదని అందులో వెల్లడించింది. చికిత్సకు గంగూలీ బాగానే స్పందిస్తున్నారని తెలిపింది. అలాగే ఈసీజీ రిపోర్టు కూడా సంతృప్తికరంగా ఉన్నట్టు బులెటిన్‌లో స్పష్టం చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు