భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లు పలు వివాదాలు తావిచ్చింది. బెంగుళూరులో టెస్టులో జరిగిన డీఆర్ఎస్ రివ్యూ వివాదంతో పాటు తాజాగా రాంచీ టెస్టులో కోహ్లీ గాయంపై ఆసీస్ ఆటగాళ్లు ఎగతాళి చేయడం, కెప్టెన్ కోహ్లీ కూడా ధీటుగా సమాధానం ఇచ్చాడు. స్లెడ్జింగ్ అనేది ఆటలో తప్పదని గంభీర్ చెప్పాడు. స్లెడ్జింగ్ ద్వారా ఆటలో కొన్ని మార్పులు తప్పవని గంభీర్ అభిప్రాయం వ్యక్తం చేసాడు.
స్లెడ్జింగ్ ద్వారా కొన్ని సందర్భాల్లో ఆసక్తికర సంఘటనలు జరుగుతాయని తెలిపాడు. బ్యాట్, బంతి వరకు మాత్రమే పరిమితమైతే క్రికెట్లో మజా ఉండదని.. కానీ స్లెడ్జింగ్ వ్యక్తిగత కక్ష పెంచుకునేందుకు మాత్రం పరిస్థితులు దారితీయకూడదని చెప్పాడు. ప్రత్యర్థి ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసేందుకు స్లెడ్జింగ్ చేయడంలో తప్పులేదు. ఎందుకంటే స్లెడ్జింగ్ వల్ల ఆటలో మజా వస్తుంది. అయితే ఈ సిరీస్‌లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అవుట్ విషయంలో డీఆర్ఎస్ రివ్యూ కోసం చేసిన తప్పిదంతో ఆట మరింత రసవరత్తరంగా మారిందని గంభీర్ వ్యాఖ్యానించాడు.
ఆటగాళ్లు రోబోలు కాదని.. కొన్నిసార్లు స్లెడ్డింగ్ చేస్తారు. కానీ అది వ్యక్తిగత దూషణకు దారితీయకూడదని గంభీర్ తెలిపాడు. ఆటవరకే పరిమితం కావాలని గంభీర్ చెప్పుకొచ్చాడు. గత రెండు టెస్టులు క్రికెట్ అభిమానులకే కాదు. తాజా, మాజీ క్రికెటర్లకు వినోద విందును రుచిచూపించాయి' అని గంభీర్ అన్నాడు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ విజేత ఎవరో నిర్ణయించే ధర్మశాల టెస్టు మార్చి 25 నుంచి ప్రారంభం కానుంది.