ఈ అజేయ హాఫ్ సెంచరీతో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన తొలి నెంబర్ 6 బ్యాటర్‌గా హార్దిక్ పాండ్యా అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనాల రికార్డులను హార్దిక్ పాండ్యా అధిగమించాడు.
అలాగే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో 3 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన సూపర్ మ్యాచ్‌లో 37 పరుగులు చేయడం ద్వారా విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా(27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. శివమ్ దూబే(24 బంతుల్లో 3 సిక్సర్లతో 34), విరాట్ కోహ్లీ(28 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 37), రిషభ్ పంత్(24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36) మెరుపులు మెరిపించారు.