టీ బ్రేకేంటి..? కాఫీ బ్రేక్ అనకూడదా?.. ఆయనంటే నాకు చాలా భయం

గురువారం, 16 జులై 2020 (12:01 IST)
భారత నెంబర్ వన్ ఆటగాడు.. ఆల్ రౌండర్‌గా నిలిచిన కపిల్ దేవ్.. 1983లో భారత్‌కు మొదటిసారి ప్రపంచ కప్ అందించాడు. చాలామంది బౌలర్లకు చుక్కలు చూపించిన కపిల్ దేవ్‌కు ఒకరంటే భయమట. కానీ ఆయన ఎవరో ఏ ప్రత్యర్థి జట్టు ఆటగాడో కాదు. భారత జట్టు ఒకప్పటి కెప్టెన్ శ్రీనివాస్ వెంకట్రాఘవన్ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. 
 
అప్పటి భారత్ జట్టు కెప్టెన్ శ్రీనివాస్ వెంకట్రాఘవన్ అంటే తనకు చాలా భయమని చెప్పుకొచ్చాడు. ఆయన ఉంటే నేను ఓ మూలకు వెళ్లి బ్రేక్‌ఫాస్ట్ చేసేవాడినని కపిల్ దేవ్ గుర్తు చేసుకున్నాడు. అంతేగాకుండా టీ బ్రేక్‌ను ఎందుకు కాఫీ బ్రేక్ అనకూడదని వాదించేవారని కపిల్ వ్యాఖ్యానించాడు. అలాగే ఆయనకు కోపం ఎక్కువని కపిల్ తెలిపాడు. 
 
1960-1970లో భారత్ స్పిన్నర్‌గా రాణించిన వెంకట్రాఘవన్ 57 టెస్టులు ఆడి మొత్తం 156 వికెట్లు తీసుకున్నాడు. అలాగే కపిల్ దేవ్ ప్రపంచ కప్ గెలిచినా 1983లోనే తన రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు