వన్డే ర్యాంకింగ్స్: అగ్రస్థానాన్ని కైవసం.. మూడు ఫార్మాట్‌లో...
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (22:54 IST)
న్యూజిలాండ్‌పై మూడో వన్డేలో భారత్ గెలవగానే.. భారత్ నెం.1 ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ట్విట్టక్ వేదికగా ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకను సైతం అదే మార్జిన్‌తో ఓడించిన టీమిండియా.. వరుసగా రెండు సిరీస్ క్లీన్‌స్వీప్‌లతో వన్డేల్లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది.
ప్రస్తుతం భారత్ ఖాతాలో 114 రేటింగ్ పాయింట్లు ఉండగా.. రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ ఖాతాలో 113 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 112 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానానికి చేరుకుంది. కివీస్ నాలుగో స్థానంలో సొంతం చేసుకుంది.
త్వరలోనే సౌతాఫ్రికాతో ఇంగ్లాండ్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయగిలిగితే.. ఇంగ్లీష్ జట్టు భారత్‌ను వెనక్కి నెట్టి వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకుంటుంది.