మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. స్వింగ్ కు అనుకూలించే పిచ్‌లపైనే ఇంగ్లండ్‌ను ఓడించామని.. పేస్‌కు అనుకూలించే వాళ్ల సొంత మైదానాల్లోనే వారిని ఓడించామని తెలిపాడు. బలహీనతలు గురించి మాట్లాడితే.. ప్రత్యర్థి జట్టులో అవి చాలానే ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. పేస్ పిచ్ వాళ్లకు అనుకూలంగా ఉంటే.. అది మాకు లాభమే.
ఇక మరో విజయాన్ని అందుకుంటే స్వదేశంలో అత్యధిక విజయాలను సాధించిన కెప్టెన్ గా ధోనీ రికార్డును కోహ్లీ బద్దలు కొడతాడు. ఈ రికార్డుపై కోహ్లీ మాట్లాడుతూ, అలాంటి విషయాలను తాము పట్టించుకోమని చెప్పాడు. రికార్డులు అస్థిరమైనవని అన్నాడు. ధోని పై తమకు ఎంతో ప్రేమ, గౌరవం ఉంటాయని చెప్పాడు. చివరి రెండు టెస్టులు గెలవాలనే తాము ఆడతామని అన్నాడు.
అలాగే మూడో టెస్టులో కోహ్లీ సెంచరీ సాధిస్తే.. ప్రపంచంలో మూడో బ్యాట్స్‌మన్‌గా, పింక్ బాల్ టెస్టులో రెండు సెంచరీలు చేసిన తొలి సారథిగా కొత్త చరిత్ర సృష్టించనున్నాడు. విరాట్ నుండి సెంచరీ వచ్చి చాలా కాలమే అవుతోంది.