చివరి టీ20లో భారత్ ఓటమి... సౌతాఫ్రికాకు ఊరట

బుధవారం, 5 అక్టోబరు 2022 (08:41 IST)
ఇండోర్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయింది. టీమిండియా ఓటమితో సౌతాఫ్రికా జట్టు ఊరట చెందింది. మొత్తం మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. దీంతో నామమాత్రమైన మూడో టీ20 మ్యాచ్ మంగళవారం రాత్రి ఇండోర్ వేదికగా జరిగింది. ఇందులో రోహిత్ సేన 49 పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో అద్భుత ఆటతీరుతో అందర్నీ ఆకట్టుకున్న సూర్యకుమార్ ఈ మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. ఫలితంగా భారత జట్టు ఓటమిని చవిచూసింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఆ జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రిలీ రుస్సో మెరుపు సెంచరీ చేశాడు. కేవలం 48 బంతుల్లో ఎనిమిది సిక్సర్లు, 7 ఫోర్ల సాయంత్రం 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే, ఓపెనర్ డికాక్ కూడా 68, స్టబ్స్ 23, మిల్లర్ 19 పరుగులతో రాణించాడు. అదనంగా 14 పరుగులు వచ్చాయి. భారత బౌలర్లలో చాహర్, ఉమేష్ యాదవ్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
ఆ తర్వాత 228 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భాత జట్టు 18.3 ఓవర్లలో 178 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టులో దినేష్ కార్తీక్ మాత్రమే అత్యధికంగా 46 పరుగులు చేయగా, దీపక్ చాహర్ 31, రిషబ్ పంత్ 27, ఉమేష్ యాదవ్ 20, హర్షల్ పటేల్ 17 చొప్పున పరుగులు చేశారు. దీంతో భారత్ 49 పరుగుల తేడాతో గెలుపొందింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు