తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు చేసింది. మిస్టర్ 360గా పేరుగాంచిన బ్యాటర్ సూర్యకుమార్ తనదైనశైలిలో బ్యాట్‌తో వీరవిహారం చేశాడు. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 51 బంతుల్లో 112 పరుగులు చేశారు. ఫలితంగా 20 ఓవర్లలో 228 పరుగులుచేసింది.
ఆ తర్వాత భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు కేవలం 137 పరుగులకే ఆలౌట్ అయింది. లంక బ్యాటర్లలో షనక 23, ఓపెనర్ మెండిస్ 23, ధనంజయ డిసిల్వా 22, అసలంక 19 పరుగులు చేశాడు. రెండో టీ20లో ఐదు నోబాల్స్ వేసి విలన్‌గా మారిన అర్షదీప్ సింగ్ మూడో టీ20లో 3 వికెట్లు లంక వెన్ను విరిచాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 2, ఉమ్రామన్ మాలిక్ 2, చహల్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ చొప్పున తీశాడు.