పాకిస్థాన్‌పై భారత్ గెలుపు.. విరాట్ కోహ్లీ రికార్డు.. భారత్ చెత్త రికార్డు ఏంటది.. బూమ్రాతో?

సెల్వి

సోమవారం, 10 జూన్ 2024 (10:33 IST)
Team India
దాయాది దేశం అయి పాకిస్థాన్‌పై భారత్ ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో రిషభ్ పంత్ (42; 31 బంతుల్లో, 6 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా (3/21), హారిస్ రవూఫ్ (3/21) చెరో మూడు వికెట్లు, మహ్మద్ అమీర్ (2/23) రెండు వికెట్లతో సత్తాచాటారు. 
 
అనంతరం ఛేదనలో పాకిస్థాన్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. బుమ్రా (3/14) మూడు, హార్దిక్ పాండ్య రెండు (2/24), అర్షదీప్ (1/31), అక్షర్ పటేల్ (1/11) చెరో వికెట్ చేతిలో తొమ్మిది వికెట్లు ఉండటంతో పాకిస్థాన్ ఫేవరేట్‌గానే నిలిచింది. ఫకర్ జమాన్ (13; 8 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) దూకుడుగా ఆడటంతో భారత్ ఆశలు సన్నగిల్లాయి. కానీ భారత బౌలర్లు గొప్పగా పుంజుకున్నారు. హార్దిక్, బుమ్రా చెలరేగడంతో పాక్ క్రమంగా వికెట్లు కోల్పోయింది. ఫలితంగా పాకిస్థాన్ జట్టు ఓటమిని చవిచూసింది. 
 
మ్యాచ్ ప్రిడిక్షన్ ప్రకారం గెలుపు అవకాశాలు భారత్‌కు 8 శాతం, పాకిస్థాన్‌కు 92 శాతంగా ఉన్నాయి. దీంతో పాక్ గెలుపు ఇక సునాయాసమేనని అనిపించింది. కానీ భారత బౌలర్లు పట్టు వదలకుండా ఆత్మవిశ్వాసంతో ఆడారు. కీలక సమయంలో వికెట్లు తీసి.. పరుగులు నియంత్రించి మ్యాచ్ విజయం కోసం రేసులోకి వచ్చారు. చివరకు ఉత్కంఠ భరిత విజయాన్ని అందుకున్నారు.  భారత బౌలర్లు అద్భుతంగా చెలరేగడంతో టీమిండియా 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. 3 కీలక వికెట్లతో చెలరేగిన స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
 
రికార్డులు 
ఈ మ్యాచ్‌లో టీమిండియా చెత్త రికార్డు నమోదు చేసింది. టీ20 ఫార్మాట్‌లో పాకిస్థాన్ చేతిలో తొలిసారి ఆలౌటైంది. పాకిస్థాన్‌పై భారత్ ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఔటవ్వడం ఇదే మొదటిసారి. అంతేగాక టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా‌కు ఇది నాలుగో అత్యల్ప స్కోరు.
 
టీ20 వరల్డ్ కప్‌లో భారత్-పాకిస్థాన్ ఏడు సార్లు తలపడ్డాయి. బౌల్ అవుట్‌తో కలిపి టీమిండియా ఆరు సార్లు నెగ్గగా, పాక్ 2021లో ఒక్కసారి గెలిచింది. అయితే ఈ మెగాటోర్నీలో పాకిస్థాన్‌తో కోహ్లి ఐదు మ్యాచ్‌లు ఆడగా ఏకంగా మూడు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం విశేషం. 
 
పొట్టి కప్‌లో పాక్‌పై ఈ అవార్డు అత్యధిక సార్లు అందుకున్న ఆటగాడిగా కోహ్లి రికార్డు సాధించాడు. అంతేగాక ఈ ఐదు మ్యాచ్‌ల్లో భారత్ తరఫున టాప్ స్కోరర్ కోహ్లినే కావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు