కోహ్లీ సేనకు పరువు దక్కేనా.. కంగారులు క్లీన్ స్వీప్ చేసేనా?

బుధవారం, 2 డిశెంబరు 2020 (09:46 IST)
భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా బుధవారం మూడో వన్డే మ్యాచ్ కాన్‌బెర్రా వేదికగా జరుగనుంది. ఇప్పటికే సిరీస్‌ను చేజార్చుకున్న భారత క్రికెట్ జట్టు ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. పైగా, రానున్న ట్వంటీ20 సిరీస్‌కు ఆటగాళ్లు ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టుకునేందుకు ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
అయితే, ఆస్ట్రేలియా మాత్రం క్వీన్ స్వీప్ చేయాలన్న పట్టుదలతో ఉంది. ఆ జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు అరవీరభయంకరమైన ఫామ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో బుధవారం ప్రారంభమైన మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకున్నారు. 
 
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధవాన్ 16 పరుగులు చేసి అబాట్ బౌలింగ్‌లు అగర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అప్పటికి భారత స్కోరు 26 పరుగులు మాత్రమే. ప్రస్తుతం శుభమన్ గిల్ (15), విరాట్ కోహ్లీ (0)లు క్రీజ్‌లో ఉన్నారు. 
 
ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన జట్ల వివరాలను పరిశీలిస్తే, 
 
భారత్: శిఖర్ ధావన్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్ దీప్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా, టి.నటరాజన్.
 
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్, మార్నస్ లుబుస్ చేంజ్, స్టీవ్ స్మిత్, కామెరాన్ గ్రీన్, మోసెస్ హెన్రిక్స్, అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్ వెల్, ఆస్టన్ అగర్, సీన్ అబాట్, ఆడమ్ జంపా, జోష్ హాజెల్ వుడ్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు