గంటకు 900 చొప్పున ప్రతి రోజు 6000 మందిని మాత్రమే ఆలయం లోపలికి అనుమతిస్తున్నారు. దర్శనం కోసం ఆన్‌లైన్‌లోనే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. 65 ఏళ్లు పైబడిన వారిని, 10 ఏళ్ల లోపు చిన్నపిల్లలను అనుమతించడం లేదని షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో షిరిడీ దర్శనానికి వచ్చే భక్తులు మనదేశ సంప్రదాయ దుస్తులు ధరించి రావాలని కోరారు.
అయితే ఇది కేవలం విజ్ఞప్తి మాత్రమేనని.. ఇప్పటి వరకు కచ్చితమైన డ్రెస్ కోడ్ ఏదీ విధించలేదని ఆలయ ట్రస్టు బోర్డు స్పష్టం చేసింది. ఈ విషయమై శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కన్హురాజ్ బాగటే మాట్లాడుతూ.. బాబాను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి రావాలని కోరారు.