మ్యాచ్ టిక్కెట్స్ కొన్నవారికి డబ్బులు చెల్లిస్తాం : హెచ్‌సీఏ

శనివారం, 14 అక్టోబరు 2017 (10:11 IST)
భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్, ఉప్పల్ స్టేడియం వేదికగా జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో మ్యాచ్ కోసం టిక్కెట్లు కొన్నవారికి డబ్బులు చెల్లిస్తామని హెదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. 
 
గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెల్సిందే. ఈనెల 12వ తేదీ రాత్రి భారీగా వర్షం పడటంతో ఉప్పల్ పిచ్ తడిసి ముద్దయింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి ఫ్యాన్లు పెట్టి మరీ… గ్రౌండ్‌ను ఆరబెట్టారు స్టేడియం సిబ్బంది. పొడిమ‌ట్టి పోసిన ఫ‌లితం లేక‌పోయింది. 
 
శుక్రవారం సాయంత్రం 7 గంటలకు గ్రౌండ్‌ను తనిఖీ చేసిన బీసీసీఐ ప్రతినిధులు.. గ్రౌండ్ ఇంకా తడిగా ఉండటంతో రాత్రి 7.45 గంటలకు మరోసారి గ్రౌండ్‌ను తనిఖీ చేసి గ్రౌండ్ తడి ఆరకపోవడం.. మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ 1-1 తో సమం అయింది. మ్యాచ్ నిలిచిపోవడంతో క్రికెట్ అభిమానులు నిరాశ‌తో వెనుదిరిగారు. అయితే మ్యాచ్ కోసం టికెట్లు కొన్నవారికి డబ్బులు తిరిగి చెల్లిస్తామని తెలిపింది హెచ్సీఏ ప్రకటించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు