మహిళల వరల్డ్‌కప్ సెమీస్‌లో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియా జట్టుతో తలపడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టులో హర్మన్ ప్రీత్ కౌర్ దూకుడుగా ఆడి 115 బంతుల్లో 171 పరుగులు సాధించి నాటవుట్‌గా నిలిచింది.. వర్షం కారణంగా ఈ మ్యాచ్ మూడు గంటలకుపైగా ఆలస్యమవడంతో మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించారు.
ఇకపోతే జట్టులో మంధన 6 పరుగులు, రౌత్ 14 పరుగులు, మిథాలీ రాజ్ 36, డి.బి శర్మ 25 పరుగులు, వి. కృష్ణమూర్తి 16 పరుగులు చేశారు.