ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ వరల్డ్ టీ20 ప్రపంచ కప్ సాగుతోంది. ఇందులోభాగంగా, ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై క్రికెట్ పసికూన నమీబియా ఘన విజయం సాధించింది. సోమవారం ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. అదీకూడా చెమటోడ్చి నెగ్గింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో ఆసీస్ 180 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (76) అర్థశతకం సాధించాడు. మిచెల్ మార్ష్ (35), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (23) ఫర్వాలేదనిపించారు.
భారత బౌలర్లు ఆరంభంలో పరుగులు ధారాళంగా ఇచ్చారు. ఫించ్‌తోపాటు మార్ష్, మ్యాక్స్‌వెల్ సులువుగానే పరుగులు రాబట్టారు. దీంతో 18 ఓవర్లకు 171/5 స్కోరుతో ఆసీస్ నిలిచింది. అయితే ఇక్కడ నుంచే అసలైన డ్రామా మొదలైంది.
అనంతరం జోష్ ఇంగ్లిస్, కేన్ రిచర్డ్‌సన్‌ను షమీ క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో ఆసీస్ 180 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో షమీ 3, భువనేశ్వర్ 2.. అర్ష్‌దీప్, హర్షల్ పటేల్, చాహల్ ఒక్కో వికెట్ తీశారు.