2002లో విదేశాల్లో 1137 పరుగులను సాధించి రాహుల్ ద్రావిడ్, 1983 నాటి మొహీందర్ అమర్ నాథ్ (1065 పరుగులు) రికార్డును బద్ధలు కొట్టగా, 16 సంవత్సరాల తరువాత కోహ్లీ దాన్ని అధిగమించి, 1138 పరుగులు సాధించాడు. ఇదే సమయంలో మరో వ్యక్తిగత రికార్డును కూడా కోహ్లీ నమోదు చేశాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులను ఆస్ట్రేలియాపై (1573 పరుగులు) సాధించాడు.