కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, విజయ్‌లు కనీసం రెండంకెల స్కోరయినా చేయలేకుండా వికెట్లు సమర్పించుకన్న వేళ క్రీజులోకి అడుగుపెట్టిన అజింక్యా రహానే, చటేశ్వర పుజారా మైదానంలో నిలదొక్కుకున్నారు. నిలకడైన ఆటతీరును కనబరుస్తున్నారు. పూజారా 189 బంతుల్లో 13 ఫోర్లతో 64 పరుగులు సాధించగా, రహానే 47 పరుగులతో అర్థ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు.
న్యూజిలాండ్ బౌలర్లు బౌల్ట్, హెన్రీ బౌలింగ్ విసిరిన బంతుల ధాటికి 46 పరుగులకే టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఒత్తిడిలో ఉన్న టీమిండియాను వారు గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం 64 పరుగులతో పుజారా, 47 పరుగులతో రహానే క్రీజులో ఉన్నారు. దీంతో టీ విరామానికి మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా 136 పరుగులు సాధించింది.