ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ : తొలి సెషన్ వర్షార్పణం

శుక్రవారం, 18 జూన్ 2021 (15:16 IST)
ఇంగ్లండ్‌లోని సౌతాంఫ్టన్ వేదికగా ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ ఫైనల్ పోరు శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఈ మ్యాచ్ తొలి సెషన్ వర్షార్పణమైంది. ఈ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్‌లు తలపడుతున్నాయి. అయితే, మ్యాచ్‌కు వ‌రుణుడు అడ్డుప‌డుతున్నాడు. 
 
మ్యాచ్ ప్రారంభమైన తర్వాత సౌథాంప్ట‌న్‌లో వ‌ర్షం కురుస్తోంది. పిచ్‌తోపాటు గ్రౌండ్‌లో కొంత భాగాన్ని క‌వ‌ర్ల‌తో క‌ప్పి ఉంచారు. గ్రౌండ్ ప‌రిస్థితిని మ్యాచ్ అధికారులు ప‌రిశీలించారు. ఫలితంగా తొలి టెస్ట్ వర్షార్పణమైంది. 
 
దీనికి సంబంధించిన ఫొటోల‌ను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. తొలి సెష‌న్‌ను ర‌ద్దు చేసిన‌ట్లు కూడా బీసీసీఐ మ‌రో ట్వీట్‌లో స్ప‌ష్టం చేసింది. మ్యాచ్ తొలి రోజు 65 శాతం వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు ఇప్ప‌టికే వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. మొత్తం ఐదు రోజులు కూడా వ‌ర్షం ప‌డే చాన్స్ ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు