జట్టు కోసం కాదు.. వ్యక్తిగత రికార్డుల కోసమే భారత క్రికెటర్ల ఆరాటం.. ఇంజమామ్

గురువారం, 23 ఏప్రియల్ 2020 (18:15 IST)
భారత క్రికెటర్లపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్, పీసీబీ మాజీ చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్‌ హక్ సంచలన కామెంట్స్‌ చేశాడు. ఇంకా భారత క్రికెటర్లను రెచ్చగొట్టే విధంగా కామెంట్లు చేశాడు. తాను క్రికెట్‌ ఆడే రోజుల్లో భారత క్రికెటర్లకు- పాకిస్తాన్‌ క్రికెటర్లకు చాలా వ్యత్యాసం ఉండేదన్నాడు. భారత్‌ క్రికెటర్లు కేవలం తమ స్థానాలను కాపాడుకోవడం కోసమే క్రికెట్‌ ఆడేవారంటూ ఆరోపించాడు.
 
తాజాగా పాక్‌ మాజీ కెప్టెన్‌ రమీజ్‌ రాజా యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత క్రికెటర్లు స్వార్థపూరితం క్రికెట్ ఆడుతారని చెప్పుకొచ్చాడు. భారత్‌లో ఆడుతున్నపుడు లెక్కల పరంగా వారి బ్యాటింగ్‌ మాకంటే చాలా పవర్‌పుల్‌గా ఉండేది. కానీ మా బ్యాట్స్‌మన్‌ 30,40 పరుగులు చేసిన అవి జట్టు విజయానికి ఉపయోగపడేవి. కాని భారత ప్లేయర్‌లు సెంచరీలు చేసిన అవి వారి వ్యక్తిగత రికార్డుల కోసమే అన్నట్లు ఉండేది. ఇదే రెండు జట్లకు ఉండే తేడా అంటూ ఇంజమామ్‌ ఎద్దేవా చేశాడు. 
 
భారత క్రికెటర్లు ఎప్పుడూ వ్యక్తిగత రికార్డులే లక్ష్యంగా బ్యాటింగ్‌ చేసేవారని ఇంజమామ్ స్పష్టం చేశాడు. ఇక పాకిస్తాన్‌ బ్యాట్స్‌మెన్‌ విషయానికొస్తే జట్టు ప్రయోజనాల కోసమే ఆడవారని, వ్యక్తిగత రికార్డులకు పాక్‌ ఆటగాళ్లు అప్పుట్లో దూరంగా ఉండేవారన్నాడు. కేవలం జట్టు గెలుపే లక్ష్యంగా పాకిస్తాన్‌ క్రికెటర్లు ఫీల్డ్‌లో దిగేవారని ఇంజమామ్‌ అన్నాడు.  
 
టీమిండియా బ్యాటింగ్‌ చాలా పటిష్టంగా ఉండేది. మాకంటే బ్యాటింగ్‌ పరంగా చాలా బలంగా ఉండేది. కాగితపు పులులు తరహాలో వారు మా కంటే స్ట్రాంగ్‌గా ఉండేవారు. బ్యాట్స్‌మెన్‌గా మా రికార్డు వారి కంటే మెరుగ్గా ఉండేది కాదు. వారు వ్యక్తిగత రికార్డుపై కన్నేసేవారు. భారత జట్టులో ఎవరైనా సెంచరీ చేస్తే అది జట్టు కోసం కాదు.. వారి వ్యక్తిగతం కోసమేనని ఇంజమామ్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించాడు. ప్రస్తుత పాక్‌ క్రికెటర్లు.. ఆనాటి భారత క్రికెటర్ల మాదిరి తయారు కావొద్దునని పిలుపు నిచ్చాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు