భారత్ క్రికెట్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆసియా కప్ టోర్నీకి దూరమయ్యాడు. గాయం కారణంగా జట్టు నుంచి పాండ్యా తప్పుకోవాల్సి వచ్చింది. పాకిస్థాన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్‌ను పాండ్యా వేశాడు. అయితే ఆ ఓవర్ ఐదో బంతి వేసిన తర్వాత పాండ్య మైదానంలో కుప్పకూలిపోయాడు.
ఆరంభంలోనే బాగానే కనిపించిన పాండ్యా నొప్పితో ఒక్కసారిగా కిందపడిపోయాడు. దీంతో భారత ఆటగాళ్లతో పాటు పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ కూడా పాండ్య వద్దకు చేరుకున్నారు. వెన్ను కింద భాగంలో కలిగిన నొప్పితో పాండ్య విలవిల్లాడి పోయాడు. అప్పటికే గాయంతో కదలలేని స్థితిలో ఉన్న పాండ్యను స్ట్రెచర్‌పై డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం పాండ్యా స్థానంలో భారత జట్టుకు దీపక్ చాహర్‌ను ఎంపిక చేశారు. ప్రాథమిక చికిత్స కారణంగా అతడు లేచి నిలుచోసాగాడని.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు బీసీసీఐ తెలిపింది.