క్రిస్ గేల్‌కు షాక్.. రాహుల్‌కు జాక్‌పాట్

శనివారం, 27 జనవరి 2018 (12:59 IST)
వెస్టిండీస్ డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్‌కు షాక్ తగిలింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం నిర్వహించిన వేలం పాటల్లో గేల్‌లు కొనుగోలు చేసేందుకు ఏ ఒక్క ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. అదేసమయంలో కేఎల్ రాహుల్‌కు జాక్‌పాట్ తగిలింది. రూ.11 కోట్లకు రాహుల్‌ను కింగ్స్ లెవన్ పంజాబ్ టీమ్ కైవసం చేసుకుంది. 
 
శనివారం మూడో రౌండ్ వేలంలో రాహుల్ అమ్ముడుపోయాడు. ఇప్పటివరకు శనివారం వేలంలో బెన్ స్టోక్స్ తర్వాత రాహుల్‌కు అత్యధిక ప్రైస్ దక్కింది. కరణ్ నాయర్‌ను కూడా కింగ్స్ లెవన్ జట్టు రూ.5.60 కోట్లకు సొంతం చేసుకుంది. 
 
మ‌నీష్ పాండే కూడా జాక్‌పాట్ కొట్టాడు. మ‌నీష్ పాండేను హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ టీమ్ కైవ‌సం చేసుకుంది. అత‌న్ని రూ.11 కోట్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ గెలుచుకున్న‌ది. ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ అమ్ముడుపోలేదు. క్రిస్ గేల్ తర్వాత అమ్ముడుపోని రెండవ ప్లేయర్ జోరూట్. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు