కెప్టెన్ కూల్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కూడా కోపం వస్తుందని మాజీ ఫేసర్ ఇర్ఫాన్ పఠాన్ అంటున్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ మాట్లాడుతూ.. ధోనీకి కోపం వస్తుందని.. ఆ కోపం చాలా భయంకరంగా వుంటుందని తెలిపాడు.
2006-07 మధ్యకాలంలో ఓ సిరీస్‌కు సంబంధించి నెట్‌లో వార్మప్ చేస్తున్నామని... వార్మప్ తర్వాత ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. అయితే వార్మప్‌లో భాగంగా కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ అందరూ ఎడం చేతివైపు, ఎండం చేతి బ్యాట్స్‌మెన్ అందరూ కుడిచేతి వైపు బ్యాటింగ్ చేయాలని రూల్ పెట్టుకున్నాం. రెండు జట్లుగా ఏర్పడ్డాం. ధోనీ బ్యాటింగ్‌కు దిగాడు.