టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, సంజన గణేశన్‌లు ప్రేమించి వివాహం చేసుకున్నారు. స్టార్ స్పోర్ట్స్ ప్రెజెంటర్ అయిన సంజన గణేషన్.. టీమిండియా స్టార్ ప్లేయర్ అయిన బుమ్రాల పరిచయం కాస్త ప్రేమగా మారి 2021 మార్చి 15న వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
గతేడాది సెప్టెంబర్ 4న వీరికి ఓ బాబు జన్మించాడు. అతనికి అంగద్ జస్‌ప్రీత్ బుమ్రాగా పేరు పెట్టారు. ప్రస్తుతం బుమ్రా.. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతున్నాడు. తొలి రెండు టెస్ట్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. హైదరాబాద్ టెస్ట్‌లో 6, వైజాగ్ టెస్ట్‌లో 9 వికెట్లు పడగొట్టాడు.