గతంలో షమీపై గృహ లైంగిక వేధింపులు, మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి ఆరోపణలతో హసీన్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. బీసీసీఐ సీరియస్ గా పరిగణించి…షమీ కాంట్రాక్టును కొన్ని రోజుల పాటు హోల్డ్‌లో పెట్టింది. ఆ తర్వాత షమీ హసీన్‌తో ఉన్న వివాదాలను పరిష్కరించుకోవడానికి కోర్టుకెక్కడంతో బీసీసీఐ అతని కాంట్రాక్టును తిరిగి పునరుద్దరించింది.
ఇక షమీ విషయానికి వస్తే… టీమిండియా తరపున షమీ ఇప్పటివరకు 50 టెస్టుల్లో 180 వికెట్లు, 79 వన్డేల్లో 148 వికెట్లు, 12 టీ20ల్లో 12 వికెట్లు తీశాడు. ఆసీస్‌తో డిసెంబర్‌లో జరిగిన మొదటి టెస్టులో గాయపడ్డాడు.