కడక్‌నాథ్ కోడి మాంసం కూడా కోడిలానే నల్లటి రంగులోనే ఉంటుంది. కడక్‌నాథ్ చికెన్ ఆరోగ్యానికి చాలా మంచిది. అతి తక్కువగా క్రొవ్వు పదార్థం ఉండటమే దీని స్పెషల్. మంచి రుచి.. దానికితోడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉండటంతో కడక్‌నాథ్ చికెన్ ధర కొండెక్కింది. వెయ్యి, పన్నెండొందలు.. ఎంతైనా పెట్టేందుకు ఎవరూ వెనకాడటం లేదు.
కడక్‌నాథ్ కోడి బ్రీడ్ ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో అందుబాటులో వుంటాయి. కోడి నలుపు.. మాంసం నలుపు.. అంతేకాదు, దీని గుడ్లు కూడా నలుపే. వాస్తవానికి గుడ్డు మరీ అంత నలుపు కాదు. కాస్త కాఫీరంగుతో ఉంటుంది. అక్కడక్కడ కొన్ని గుడ్లు పింక్ కలర్‌లో వస్తున్నాయి.
కడక్‌నాథ్ కోళ్లను ఇప్పుడు ఇళ్ల దగ్గర కూడా పెంచుకుంటున్నారు. వీటి మాంసం కోసమే కాదు, గుడ్లు కోసం కొంతమంది పెంచుకుంటున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెట్ టీమ్ కెప్టెన్ ధోనీ కడక్‌నాథ్ కోళ్ల బిజినెస్‌లో ఎంతవరకు సక్సెస్ అయ్యాడో తెలీదు కానీ.. అప్పట్నుంచి ఈ చికెన్ మాత్రం బాగా పాపులర్ అయిపోయింది.