దేశానికి ప్రపంచ వన్డే క్రికెట్ కప్‌లను సాధించిన పెట్టినవారిలో హర్యానా హరికేన్ కపిల్ దేవ్, జార్ఖండ్ డైనమేట్ మహేంద్ర సింగ్ ధోనీల పేరు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించపడివున్నాయి. అయితే, వీరిద్దరికి ఓ విషయంలో సారూప్యత ఏర్పడింది. భారత ప్రభత్వం అందజేసే పౌర పురస్కారాల్లో పద్మభూషణ్ ఒకటి.
ఈ అవార్డును భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనీ ఏప్రిల్ రెండో తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా మూడో అత్యున్నత పౌరపురస్కారమైన పద్మభూషణ్‌ను అందుకున్నారు. యాదృచ్ఛికంగా 2011లో అదే రోజున ధోనీ సారథ్యంలోని భారత జట్టు ప్రపంచకప్‌ను గెలుచుకుంది. 2, ఏప్రిల్ 2011న శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో బౌలర్ తలపై నుంచి అద్భుతమైన సిక్సర్ కొట్టిన ధోనీ భారత్‌కు రెండో ప్రపంచకప్‌ను అందించాడు.