మ్యాచ్‌ల రద్దు.. అలాంటి వారిని ఆదుకునేందుకు సిద్ధం: గణేశ్ అయ్యర్

గురువారం, 2 ఏప్రియల్ 2020 (19:06 IST)
భారత దేశంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందడంతో క్రీడా పోటీలు రద్దు అయ్యాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్‌లపైనే ఆధారపడి ఉన్న చిన్నపాటి ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయి కష్టాల్లో పడ్డారు. వీరిలో స్థానిక మ్యాచ్‌లకు అంపైర్లుగా వ్యవహరించే వారు, స్కోరర్లు ప్రధానంగా ఉన్నారు. 
 
ఇలాంటి వారిని ఆదుకునేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ మాజీ సభ్యుడు, బీసీసీఐ మాజీ అంపైర్ గణేశ్ అయ్యర్ ముందుకొచ్చారు. క్రికెట్ మ్యాచ్‌లు నిలిచిపోవడంతో కష్టాల్లో పడ్డ వారిని ఆదుకొనేందుకు తన మిత్రులతో కలిసి ఆయన 'లెండింగ్ ఏ హ్యాండ్' అనే సంస్థను ఏర్పాటు చేశారు.
 
ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే టోర్నమెంట్‌లలో అంపైర్లుగా చేసేవారు రోజుకి రూ.2వేలు, స్కోరర్లు రూ.1,500 వేతనంగా అందుకుంటారని ఎంసీఏ తెలిపింది. ఇప్పుడు మ్యాచ్‌లు లేకపోవడంతో వారికి రాబడి లేకుండా పోయింది. వీరిని ఆదుకొనేందుకే ఈ సంస్థను ఏర్పాటు చేశామని అయ్యర్ వెల్లడించారు. ఇప్పటి వరకూ రూ.2.5లక్షలు విరాళాల రూపంలో వచ్చాయి. ఈ విరాళాలను అందించేందుకు అన్నీ రకాల చర్యలు తీసుకుంటున్నట్లు అయ్యర్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు