ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలపై ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఆసియా కప్ 2025 ఆడేందుకు వెళ్తున్నావని, ఫ్యాషన్ షోకు కాదని సెటైర్లు పేల్చుతున్నారు. ఈ ఎక్స్‌ట్రాలే తగ్గించుకొని ఆటపై ఫోకస్ పెట్టాలని హితవు పలుకుతున్నారు. ఈ నయా హెయిర్ స్టైల్ ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్, వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్‌ను తలపిస్తుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
బ్రిటీష్ గాయని, టీవీ నటి అయిన జాస్మిన్ వాలియాను ఇంప్రెస్ చేసేందుకే హార్దిక్ తన లుక్‌ను మార్చాడని మరికొందరు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్‌ను వదిలేసిన హార్దిక్ పాండ్యా.. జాస్మిన్ వాలియాతో ప్రేమలో వున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.