హామిల్టన్ వేదికగా ఆదివారం ఉదయం పర్యాటక భారత్, ఆతిథ్య భారత్ జట్ల మధ్య జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్‌ను వర్షం కారణంగా రద్దు అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. వరుణు కారణంగా మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించారు.
ఈ పరిస్థితుల్లో 12.5 ఓవర్లలో 89/1 స్కోరుతో మెరుగైన స్థితిలో ఉన్న దశలో వర్షం మరోమారు అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. అప్పటికి గిల్ 42 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 45 పరుగులు చేయగా, సూర్యకుమార్ 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 35 పరుగులతో నిలిచాడు.
ఆ తర్వాత వర్షం ఏమాత్రం ఎడతెరిపి లేకుండా కురవడంతో మైదానాన్ని పరిశీలించిన ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, తొలి వన్డేలో నెగ్గిన న్యూజిలాండ్ జట్టు 1-0 ఆధిక్యంతో ఉన్న విషయం తెల్సిందే. ఈ నెల 3వ వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఆగిన లేక భారత్ ఓడిపోయినా వన్డే సిరీస్‌ను ఆతిథ్య కివీస్ జట్టు 1-0 తేడాతో కైవసం చేసుకుంటుంది.