పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ అజంపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. పెళ్లి పేరుతో తనను మోసం చేశారంటూ ఓ మహిళ ఆరోపణలు చేసింది. తాను, బాబర్ అజాం కలిసి చదువుకున్నామని, తనను పెళ్లి చేసుకుంటానని మొదట బాబరే ప్రతిపాదించాడని ఆమె వెల్లడించింది. 2011లో రిజిస్టర్ మ్యారేజి చేసుకునేందుకు తాము ఇంటి నుంచి వెళ్లిపోయామని తెలిపింది.
బాబర్ కెరీర్ తొలినాళ్లలో అతనికి తాను ఆర్థిక సాయం చేశానని, అతని ఎదుగుదల కోసం ఎంతో డబ్బు ఖర్చు చేశానని వివరించింది. అయితే, పాక్ జట్టుకు ఎంపికైన తర్వాత బాబర్ అజాం పూర్తిగా మారిపోయాడని, పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి గర్భవతిని కూడా చేశాడని ఆరోపించింది. గర్భవతిననే విషయం కూడా మరచి తనను కొట్టాడని ఆరోపించింది. తనపై బెదిరింపులకు కూడా పాల్పడుతున్నాడని వెల్లడించింది.
2010లోనే అతడు తనకు ప్రపోజ్ చేశాడని తెలిపింది. తాను కూడా అందుకు అంగీకరించానని, అయితే తమ కుటుంబాలు మాత్రం పెళ్లికి అంగీకరించలేదని ఆ మహిళ వెల్లడించింది. 2011లో తాము ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయామని, అప్పటి నుంచీ అక్కడక్కడా ఇల్లు అద్దెకు తీసుకొని తాము కలిసే ఉండేవాళ్లమని తెలిపింది.
అయితే పెళ్లి చేసుకుందామని ఎప్పుడు అడిగినా.. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో తాను లేనని అతడు చెప్పే వాడని ఆ మహిళ చెబుతోంది. 2016లో తాను గర్భం దాల్చినప్పటి నుంచీ బాబర్ పూర్తిగా మారిపోయాడని ఆమె చెప్పింది. ఈ ఆరోపణలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇంకా స్పందించలేదు. బాబర్ ఆజం ప్రస్తుతం పాక్ టీమ్‌తో కలిసి న్యూజిలాండ్‌లో ఉన్నాడు. పైగా, అన్ని ఫార్మెట్లకు కెప్టెన్‌గా నియమించిన విషయం తెల్సిందే.