అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేకపోవడం వల్లే ఓడిపోయాం : పాక్ కోచ్ అకీబ్

ఠాగూర్

బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (18:38 IST)
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా, గత ఆదివారం చిరకాల ప్రత్యర్థి భారత్‍‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమిని పాకిస్థాన్ క్రికెట్ అభిమానులతో పాటు ఆ దేశ ప్రజలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ అకీబ్ జావేద్ స్పందిస్తూ, తమ జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేకపోవడమే ఓటమికి కారణమన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మీడియా స్పందిస్తూ, ఒక్క దుబాయ్‌లోనే మ్యాచ్‌లు ఆడటం భారత జట్టుకు కలిసివస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, భారత్ చేతిలో ఓడిపోవడానికి అదొక్కటే సాకుగా చూపబోమన్నారు. 
 
భారత జట్టు ఒక నిర్ధిష్ట కారణంతో దుబాయ్‌లో మాత్రమే మ్యాచ్‌లు ఆడుతోంది. ఒకే మైదానంలో ఆడటం, ఒకే హోటల్‌లో ఉండటం వల్ల ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. కానీ, మేం దానివల్ల ఓడిపోలేదు. మాతో మ్యాచ్‌కు ముందు భారత్‌లో దుబాయ్‌లో 10 మ్యాచ్‌లేమీ ఆడలేదని గుర్తుచేశారు. పైగా, అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేకపోవడం వల్ల భారత్ చేతిలో ఓటమిని చవిచూశామని వ్యాఖ్యానించారు. 
 
మేం జట్టును మెరుగుపర్చడానికి మాత్రమే ప్రయత్నిస్తాం. వేరే మార్గం లేదన్నారు. మేం తదుపరి మ్యాచ్‌పై దృష్టిసారిస్తాం. కానీ, భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ విషయంలో చాలా భావోద్వేగాలు ముడిపడివుంటాయి. మానసికంగా ఇబ్బందికి గురవుతారు. అభిమానులు, జర్నలిస్టుల కంటే ఆటగాళ్లు చాలా రెట్లు బాధపడ్డారు. భారత్ వంటి జట్టుతో ఆడాలంటే చాలా అనుభవం అసరం. 
 
ప్రస్తుతం ఉన్న భారత జట్టు అత్యంత అనుభవజ్ఞులతో ఉంది. మా జట్టులో అలాంటి ఆటగాళ్లు ఎక్కువ మంది లేరు. ప్రస్తుతం జట్టులో ఉన్నవారిలో బాబర్ అజామ్ ఒక్కడే వంద కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. మహ్మద్, రిజ్వాన్‌లకు కొంత అనుభవం ఉంది. మిగిలిన ఆటగాళ్లందరూ 30 కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడారు అని అకీబ్ వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు