వివాదంలో కొత్త పెళ్ళి కొడుకు జడేజా.. సింహాల ముందు ఫోజులిచ్చి సోషల్ మీడియాలో పోస్ట్?!

శుక్రవారం, 17 జూన్ 2016 (14:00 IST)
ప్రముఖ ఇండియన్ క్రికెటర్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వివాదంలో చిక్కుకున్నారు. ఇందుకు కారణం సింహాలు ముందు ఫోటోలకు ఫోజులివ్వడమే. భారత అటవీ శాఖ నిబంధనలను ఉల్లంఘించి సింహాల ముందు ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే ఇందుకు గల ముఖ్య కారణం. ఇటీవలే కొత్తగా పెళ్లి చేసుకున్న జడేజా తన భార్య, స్నేహితులతో కలిసి రెండు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్‌ రాష్ట్రంలోని జునాఘడ్‌ జిల్లాలో గల సాసన్‌ గిర్‌కు వెళ్లాడు. 
 
అక్కడి గిర్‌ నేషనల్‌ పార్క్‌ అండ్‌ సాంక్చూరీలోని లైన్‌ సఫారీకి వెళ్లారు. దాదాపు పదికి పైగా సింహాలు హాయిగా నిద్రిస్తుంటే... వాటికి సమీప దూరంలో కూర్చుని తన భార్యతో రీవా సోలంకితో కలిసి ఫోటోలు దిగాడు. అయితే, తమ ఆనందం కోసం ఈ ఫొటో తీసుకున్నప్పటికీ వన్యప్రాణి సంరక్షణ చట్టానికి పూర్తిగా వ్యతిరేకం కావడంతో అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో జడేజా దంపతులు నిబంధనలను ఉల్లంఘించినట్టు ఈ ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి