లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండవ టెస్టులో భారత ఓపెనర్లు చరిత్ర సృష్టించారు. ఓపెనర్లుగా దిగిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ 126పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లార్డ్స్ మైదానంలో ఇండియా ఓపెనర్లు చేసిన అత్యధిక భాగస్వామ్యం ఇదే. దాదాపు 69ఏళ్ల తర్వాత ఇంతటి భాగస్వామ్యాన్ని నెలకొల్పి చరిత్ర తిరగరాసారు. గురువారం జరిగిన మ్యాచులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన భారత్ కి అరుదైన ఘనతని అందించింది.