సౌదీ అరేబియా స్కై స్టేడియం, ఇక ఆకాశం నుంచి క్రికెట్ చూడొచ్చు (video)

ఐవీఆర్

సోమవారం, 27 అక్టోబరు 2025 (23:15 IST)
ఎంతసేపు నేల మీద కూర్చుని గ్యాలరీల నుంచి చూస్తాము. ఆకాశం నుంచి క్రికెట్ చూస్తే ఆ కిక్కే వేరబ్బా అన్నట్లు సౌదీ అరేబియా కొత్త ఆలోచన చేస్తోంది. భూమి నుంచి ఏకంగా 350 మీటర్ల ఎత్తులో క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు సిద్ధమవుతోంది.
 
ఇది ప్రపంచంలోనే తొలి స్కై స్టేడియం అవ్వనుంది. తన భవిష్యత్తు నగరం అయిన ది లైన్ లో నియోమ్ స్టేడియం అనే పేరుతో స్కై స్టేడియం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది 2032 సంవత్సరం నాటికి ప్రారంభం చేస్తామని తెలియజేసింది. ప్రపంచ కప్ పోటీలకు ఇక్కడ ఆతిథ్యం ఇస్తామంటూ వెల్లడించింది.

సౌదీ అరేబియాలో స్కై స్టేడియం!

ప్రపంచంలోనే మొట్టమొదటి స్కై స్టేడియాన్ని సౌదీ అరేబియా నిర్మించాలని చూస్తోంది. సౌదీ తన భవిష్యత్తు నగరం 'ది లైన్‌'లో 'నియోమ్ స్టేడియం' అనే స్కై స్టేడియాన్ని నిర్మించనుంది. 2032 నాటికి ఇది ప్రారంభంకానున్నట్లు తెలిపింది. 2034 ఫీఫా ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు… pic.twitter.com/ye15SmIeuw

— ChotaNews App (@ChotaNewsApp) October 27, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు