భారత్ - ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ : బీసీసీఐకు షాక్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం

మంగళవారం, 8 నవంబరు 2016 (19:31 IST)
ఈనెల 9వ తేదీ నుంచి రాజ్‌కోట్ వేదికగా భారత్, ఇంగ్లండ్ దేశాల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ నిర్వహణ కోసం తమ వద్ద పైసా డబ్బులు లేవని, నిధులు ఇస్తేగానీ మ్యాచ్ నిర్వహించలేమని సుప్రీంకోర్టులో బీసీసీఐ అత్యవసర పిటీషన్‌ను దాఖలు చేసింది. 
 
దీనిపై విచారణ జరిపిన కోర్టు... మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం రూ.56 లక్షలు ఖర్చు చేసేందుకు బీసీసీఐకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు నిధుల నుంచి బీసీసీఐ ఆ డబ్బులను తీసుకుని మ్యాచ్‌ నిర్వహణకు ఖర్చు చేయనుంది.
 
కాగా, లోథా కమిటీ సంస్కరణలు అమలు చేయడానికి బీసీసీఐ తాత్సారం చేస్తుండగా, అలా చేయకపోతే నిధులు విడుదల చేయడంలో తామేమీ చేయలేమని లోథా కమిటీ స్పష్టం చేసింది. నిధులు ఖర్చు చేయకుండా బ్యాంక్ లావాదేవీలను కూడా నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 

వెబ్దునియా పై చదవండి