భారత సైన్యంపై అతి కిరాతకంగా దాడి చేసి 20 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న చైనాపై భారత క్రికెటర్ సురేష్ రైనా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చైనా వస్తువులను తక్షణం నిషేధించాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్‌పై దాడి చేసిన డ్రాగన్ దేశం మన డబ్బుతో నడవకుడదని, చైనా వస్తువులను నిషేధించాలని డిమాండ్ చేశారు.
దేశం తరుపున ఆడుతూ ప్రతి ఒక్కరూ గర్వపడేలా చేయడమే మా కర్తవ్యం. భారత ప్రభుత్వం, బీసీసీఐ అనుమతిస్తే సరిహద్దులోకి వెళ్లి జావాన్లకు సాయం చేస్తాం, ప్రతి సైనికుడి వెంట యావత్తు దేశం ఉందని తెలియజేస్తాం అని చెప్పుకొచ్చారు.